Hyderabad, జూలై 2 -- మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ఒకటి నరివెట్ట (Narivetta). అక్కడి స్టార్ హీరో టొవినో థామస్ లీడ్ రోల్లో నటించాడు. ఈ సినిమా నరివెట్ట నక్కల వేట పేరుతో తెలుగులోనూ థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడీ సినిమాను సోనీ లివ్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతోంది.

నిజజీవిత ఘటనల ఆధారంగా రూపొందిన మలయాళం మూవీ నరివెట్ట మే 23న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు సుమారు నెలన్నర రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. సోనీ లివ్ ఓటీటీ జులై 11 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

ఈ విషయాన్ని ఆ ఓటీటీ బుధవారం (జులై 2) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. "నిజం ప్రతిధ్వనులు, అన్యాయం నీడలు.. నరివెట్ట మూవీని జులై 11 నుంచి కేవలం సోనీలివ్ లో మాత్రమే చూడండి" అనే క్...