Hyderabad, సెప్టెంబర్ 2 -- సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ (Coolie) మూవీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది. ఆగస్టు 14న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి రాబోతోంది. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే అంటూ బజ్ నెలకొంది.

రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య రిలీజైన యాక్షన్ థ్రిల్లర్ మూవీ కూలీ. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ ప్లాట్‌ఫామ్ సెప్టెంబర్ 11 నుంచి సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓటీటీప్లే రిపోర్టు వెల్లడించింది.

దీనిపై మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేయనున్నట్లు కూడా తెలిపింది. ఆ లెక్కన థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కానుంది. వచ్చే వారం ఈ సినిమా ఓటీట...