భారతదేశం, అక్టోబర్ 28 -- నాలుగో వారంలోనూ బాక్సాఫీస్ దగ్గర కాంతార చాప్టర్ 1 కలెక్షన్ల మోత కొనసాగుతోంది. గుల్షన్ దేవయ్య, రుక్మిణి వసంత్, జయరామ్ ప్రధాన పాత్రల్లో రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి పనితీరు కనబరుస్తోంది. ఇది 2022 బ్లాక్ బస్టర్ కాంతారాకు ప్రీక్వెల్. భారీ ఓపెనింగ్స్ దక్కించుకున్న కాంతార చాప్టర్ 1.. బాక్సాఫీస్ దగ్గర నిలకడ కొనసాగిస్తోంది.

కాంతార చాప్టర్ 1 మూవీ ఫస్ట్ రోజు ఇండియాలో రూ.61.85 కోట్లు సొంతం చేసుకుంది. తొలి వారంలోనే రూ.337 కోట్లు దాటింది. రెండో వారంలో మరో రూ.147.85 కోట్లు యాడ్ చేసింది. మూడో వారంలో రూ.78.85 కోట్లు దక్కించుకుంది. ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లతో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచింది కాంతార చాప్టర్ 1.

చాలా ఇతర సినిమాల బాక్సాఫీస్ కలెక్షన...