భారతదేశం, జనవరి 13 -- కొత్త వారం వచ్చిందంటే చాలు ఓటీటీలోకి సరికొత్త సినిమాలు ఎంట్రీ ఇస్తుంటాయి. వాటిలో అన్ని రకాల జోనర్స్ ఉంటాయి. అయితే, ఓటీటీ ఆడియెన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే జోనర్లలో హారర్ థ్రిల్లర్స్ ఒకటి. ఇటీవల కాలంలో ఈ హారర్ సినిమాలకు కామెడీ, సైకలాజికల్, క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ వంటి అదనపు హంగులు జోడిస్తున్న విషయం తెలిసిందే.

అలానే తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది హారర్ మర్డర్ మిస్టరీ సైకలాజికల్ థ్రిల్లర్. ఆ సినిమా పేరే నికిత రాయ్. రచయిత్రిగా పనిచేసే నికిత రాయ్ అనే యువతి చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమాలో వింత ఆకారాలు, భ్రమలు, డ్రగ్స్, మత పిచ్చి, డిటెక్టివ్‌, ఇన్వెస్టిగేషన్ వంటి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి.

ఇటీవలే హారర్ థ్రిల్లర్ జటాధర సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన మూవీనే నికిత...