భారతదేశం, జూన్ 22 -- ప్రతి సండేలాగే ఈ రోజు (జూన్ 22) కూడా మరో కొత్త సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఏవి అలనాటి ముద్దులు అనే రొమాంటిక్ టైటిల్ తో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కల్యాణ్, నటాషా జంటగా నటించిన ఈ మూవీ ఆదివారం నుంచే స్ట్రీమింగ్ అవుతుంది.

ఏవి.. అలనాటి ముద్దులు అంటూ డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది ఈ సినిమా. ఆదివారం నుంచి ఈటీవీ విన్ లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. గత మూడు నెలలుగా ప్రతి ఆదివారం ఓ కొత్త షార్ట్ మూవీని తీసుకొస్తున్న ఈటీవీ విన్ ఈసారి కూడా అలాంటిదే మరో సినిమాను అందిస్తోంది. అందులో భాగంగానే ఏవి అలనాటి ముద్దులు ఓటీటీలోకి వచ్చేసింది.

ఊహించని అనురాగం, భావోద్వేగాల కథే ఏవి.. అలనాటి ముద్దులు అని ఈటీవీ విన్ ప్లాట్ ఫామ్ చెబుతోంది.

"ఊహించని అనురాగం, భావోద్వేగాల కథ ఇది. ఏవి అలనాటి ముద్దులు.. కథ...