భారతదేశం, జూలై 8 -- ఒకప్పుడు తన స్టెప్పులతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు మైఖేల్ జాక్సన్. ఆయన మరణించినా తన డ్యాన్స్ తో ఎప్పటికీ జీవించే ఉంటారు. మైఖేల్ జాక్సన్ వేసిన బ్రేక్ డ్యాన్స్ స్టెప్పుల్లో ఐకానిక్ మూన్‌వాక్ కు ఉన్న క్రేజే వేరు. ఇప్పుడు ఇదే స్టెప్ పేరుతో వచ్చిన మలయాళం సినిమా ఓటీటీలో రిలీజైంది. మూన్‌వాక్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

2020లో మూన్‌వాక్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తే అది 2025లో థియేటర్లలో రిలీజైంది. చివరకు ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు లిజో జోస్ పెల్లిస్సేరి థియేటర్లలో విడుదల చేశారు. 2025 మే 30న ఈ మూవీ రిలీజ్ అయింది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐఎండీబీలో 8 రేటింగ్ దక్కింది. ఇప్పుడీ సినిమా ఓటీటీ ఆడియన్స్ ను కూడా ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేసింది.

మలయాళం మూవీ మూన్‌వాక్ (Moonwalk) జియోహాట్‌స్టార్ ఓటీటీలో ఈ రోజు...