Hyderabad, జూన్ 23 -- మలయాళంలో గత నెల థియేటర్లలో రిలీజైన రొమాంటిక్ ఫ్యాంటసీ మూవీ లవ్లీ (Lovely). ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. అయితే ప్రస్తుతం ఈ మూవీపై కాపీరైట్ ఆరోపణలు ఉండటం విశేషం. అది కూడా మన ఎస్ఎస్ రాజమౌళి తీసిన ఈగ మూవీ ప్రొడ్యూసర్ చేసినవే. ఆ ఈగనే ఈ మలయాళం ఈగలోనూ అలాగే వాడుకున్నారన్నవి ఆ ఆరోపణలు.

మలయాళం మూవీ లవ్లీ సోమవారం (జూన్ 23) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. గత నెల 16న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు అక్కడి ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. 3డీలోనూ సినిమా రిలీజ్ అయింది. ఆ వెర్షన్ చిత్రీకరణ చాలా బాగుందన్న ప్రశంసలు దక్కాయి.

కానీ స్క్రిప్ట్ చాలా బలహీనంగా ఉండటంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఐఎండీబీలోనూ 6.4 రేటింగ్ మాత్రమే వచ్చింది. తెలుగులోనూ మూవీని రిలీజ్ చేసినా ఎవరూ పట్టించుక...