భారతదేశం, నవంబర్ 28 -- మలయాళ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే తెలుగు ప్రేక్షకుల కోసం మరో సినిమా వచ్చేసింది. ఓ మర్డర్ మిస్టరీ కథతో ఆగస్టు 21న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా పేరు ది కేస్ డైరీ. అష్కర్ సౌదాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ మనోరమా మ్యాక్స్‌లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది.

మలయాళం థ్రిల్లర్ సినిమాలకు తెలుగులో చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఓ చిన్న స్టోరీ లైన్ బేస్ చేసుకొని దానిని చాలా థ్రిల్లింగా చెప్పడంతో మలయాళ ఫిల్మ్ మేకర్స్ ఆరితేరిపోయారు. అయితే అన్ని సినిమాలూ అంత థ్రిల్ పంచలేవు. అలాంటిదే ది కేస్ డైరీ కూడా. థియేటర్లలో మూడు నెలల కిందట రిలీజైనా ప్రేక్షకుల ఆదరణ అంతగా దక్కలేదు. ఐఎండీబీలో కేవలం 3.5 రేటింగ్ మాత్రమే సాధించింది.

ఇప్పుడీ సినిమా మనోరమ మ్యాక్స్ ఓటీటీలోకి వచ్చింది. కేవలం మలయాళం ఆడియో, ఇ...