భారతదేశం, మే 23 -- ఓటీటీలోకి కొత్త సినిమాలను మోసుకొస్తూ మరో శుక్రవారం (మే 23) వచ్చేసింది. డిఫరెంట్ జోనర్ సినిమాలు ఆడియన్స్ ను అలరించేందుకు వచ్చేశాయి. ఇందులో ఓ తెలుగు కామెడీ థ్రిల్లర్ స్పెషల్ గా నిలుస్తోంది. అదే 'సారంగపాణి జాతకం'. కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ ఈ రోజు నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

ప్రియదర్శి లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన 'సారంగపాణి జాతకం' మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ సినిమా ఫ్యాన్స్ ను అలరిస్తోంది. ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ నెలలోపే ఓటీటీలోకి వచ్చేసింది.

జాతకాల పిచ్చి, కామెడీ, మర్డర్ ప్లాన్, కాస్త థ్రిల్.. ఇలాంటి ఎలిమెంట్స్ తో సాగే సారంగపాణి జాతకం మూవీకి థియేటర్లలో మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే కామెడ...