భారతదేశం, జూలై 17 -- డిఫరెంట్ స్టోరీ లైన్.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు తమిళ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్న 'మనిదర్గల్' మూవీ ఈ రోజు (జూలై 17) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఒకే రాత్రిలో జరిగే కథ ఇది. పీకల దాకా తాగి అనుకోని ప్రమాదంలో చిక్కుకునే ఆరుగురు ఫ్రెండ్స్ స్టోరీ ఇది.

మే 30న థియేటర్లలో రిలీజైన మనిదర్గల్ (Manidhargal) మూవీ అదరగొట్టింది. డిఫరెంట్ కాన్సెస్ట్ తో విభిన్న ప్రయత్నంగా వచ్చిన ఈ థ్రిల్లర్ సినిమాను ఆడియన్స్ ఆదరించారు. ఈ సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చేయడంతో ఐఎండీబీలో ఏకంగా 9.0 రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా గురువారం రెండు ఓటీటీల్లోకి వచ్చేసింది. ఆహా తమిళ్ తో పాటు సన్ నెక్ట్స్ లో కూడా ఈ ఫిల్మ్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. మనిదర్గల్ అంటే మ...