భారతదేశం, డిసెంబర్ 23 -- ఓటీటీలోకి ఎప్పటికప్పుడు డిఫరెంట్ కంటెంట్ సినిమాలు, సిరీస్‌లు ప్రత్యక్షమవుతుంటాయి. అలాగే, ఇటీవల ఓటీటీలోకి డిఫరెంట్ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఒకరి భర్తను మరొకరు చంపేలా ఇద్దరు భార్యలు డీల్ ఫిక్స్ చేసుకుంటారు. కానీ, ఆ తర్వాత వచ్చే ట్విస్టులు అదిరిపోతూ థ్రిల్లింగ్‌గా సాగుతుంది ఈ సిరీస్.

ఆ ఓటీటీ సిరీస్ పేరే కర్మా కోర్మా. ఇందులో రివేంజ్‌తోపాటు వంటలు, స్నేహం, రొమాన్స్ అంశాలు కూడా ఉంటాయి. ఊహించని హత్యల చుట్టూ తిరిగే బెంగాలీ వెబ్ సిరీస్ 'కర్మ కోర్మా'లో రితాభరి చక్రవర్తి, సోహిణి సర్కార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ఒక బెంగాలీ వెబ్ సిరీస్.

మన జీవితంలో 'కర్మ' మనం చేసిన పనుల ఫలితం అయితే.. 'కోర్మా' రుచికరమైన భోజనం. ఈ రెండింటినీ కలిపి ఒక పదునైన క్రైమ్ థ్రిల్లర్‌గా మలిచారు దర్శకుడు ప్రతీమ్ డి. ...