Hyderabad, అక్టోబర్ 12 -- బిగ్ బాస్‌లోకి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్, సెలబ్రిటీలతోపాటు సీరియల్ హీరోయిన్స్, నటీనటులు కంటెస్టెంట్స్‌కా వెళ్తుంటారు. అలా ప్రస్తుతం ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లో ఆకట్టుకుంటోన్న సీరియల్ హీరోయిన్ తనూజ గౌడ అలియాస్ తనూజ పుట్టస్వామి.

ముద్ద మందారం, అగ్ని పరీక్ష సీరియల్స్‌లో అట్రాక్ట్ చేసిన బ్యూటిఫుల్ తనూజ గౌడ బిగ్ బాస్ 9 తెలుగులో తన గేమ్‌తో అలరిస్తుంది. అయితే, బిగ్ బాస్‌కు వెళ్లకముందు తనూజ గౌడ ఓ సినిమా కూడా చేసింది. అది కూడా తెలుగు మూవీ. ఆ సినిమానే లీగల్లీ వీర్.

2024లో వచ్చిన తెలుగు లీగల్ క్రైమ్ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామా చిత్రమే లీగల్లీ వీర్. రవి గోగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాను శివ చైతన్య నిర్మించారు. లీగల్లీ వీర్ సినిమాలో మలికిరెడ్డి, తనూజ పుట్టస్వామి, ప్రియాంక రెవ్రీ, దయానంద్ రెడ్డి, జయశ్ర...