Hyderabad, మే 1 -- ఓటీటీలోకి ఎన్నో రకాల సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ ప్రీమియర్ అవుతూనే ఉంటాయి. అయితే, వాటిలో వైవిధ్యభరితమైన జోనర్స్‌లో చిత్రాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంటాయి. ప్రస్తుతం చిన్నారులు సమ్మర్ హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం పూట అవుట్ డోర్ గేమ్స్ ఆడించండం పిల్లలకు ఆరోగ్యాన్ని ఇస్తుంది.

అయితే, మధ్యాహ్నం సమయంలో అయితే ఎండ వేడి తెగ చిరాకుపెడుతుంటుంది. ఇలాంటి సమయంలో పిల్లలు ఇంట్లోనే కూర్చుని ఎంచక్కా చూసేలా ఓ యానిమేషన్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఆ న్యూ యానిమేటెడ్ సినిమానే ఫ్లో. ఎన్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రశంసలు అందుకున్న ఫ్లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు రీసెంట్‌గా వచ్చేసింది.

77వ వార్షి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో మేలో ఫ్లో సినిమాను ప్రదర్శించారు. ఇది ఒక యూనిక్ యానిమేటెడ్ సినిమాగా మంచి అప్లాజ్ తెచ్చుకుంది. ...