Hyderabad, జూలై 24 -- ముగ్గురు హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించిన భైరవం మూవీ టీవీలోకి వచ్చేస్తోంది. మే 30న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా రెండు నెలల్లోపే టీవీ ప్రీమియర్ కానుండటం విశేషం. నిజానికి ఈ మూవీ గత వారమే ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చి జీ5 ఓటీటీలో రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తోంది.

తమిళ మూవీ గరుడన్ ఆధారంగా తెలుగులో ముగ్గురు హీరోలతో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ భైరవం. ఈ సినిమా వచ్చే ఆదివారం (జులై 27) జీ తెలుగు ఛానెల్లో టెలికాస్ట్ కానుంది. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయనున్నట్లు ఆ ఛానెల్ వెల్లడించింది. థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా ప్రస్తుతం జీ5 ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోంది.

ఈ సినిమా జులై 18న జీ5 ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. తొలి నాలుగు రోజుల్లోనే ఈ మూవీ 100 మిలియన్ల స్ట్రీమింగ...