భారతదేశం, జూలై 13 -- మ్యాడ్ మూవీ ఫేమ్, యంగ్ హీరోయిన్ అనంతిక సనిల్‍కుమార్ ప్రధాన పాత్ర పోషించిన 8 వసంతాలు చిత్రం జూన్ 20వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఫణీంద్ర నర్శెట్టి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. కవితాత్మకంగా ఈ రొమాంటిక్ డ్రామా చిత్రాన్ని తెరకెక్కించారు. థియేట్రికల్ రన్‍లో ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. కాగా, ఇటీవలే ఓటీటీలో 8 వసంతాలు చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. అప్పుడే ట్రెండింగ్‍లోకి కూడా వచ్చేసింది.

8 వసంతాలు చిత్రం జూలై 11న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. స్ట్రీమింగ్ తర్వాత ఈ చిత్రానికి ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతోంది.

థియేట్రికల్ రన్‍లో 8 వసంతాలు మూవీకి అనుకున్న రేంజ్‍లో పాజిటివ్ స్పందన రాలేదు. స్లో నరేషన్‍తో పాటు కొన్ని సీన్ల విషయంలో నెగెటి...