భారతదేశం, జూలై 10 -- న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామాగా పాపులర్ అయిన వెబ్ సిరీస్ మూడో సీజన్ త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో టాప్-3లో ఒకటైన 'ది స‌మ్మ‌ర్ ఐ ట‌ర్న్‌డ్ ప్రెటీ' వెబ్ సిరీస్ లో చివరిదైన మూడో సీజన్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. యూత్ ఎమోషన్స్, ఫీలింగ్స్, రొమాన్స్ చుట్టూ ఈ వెబ్ సిరీస్ సాగుతుంది. రొమాంటిక్ సీన్స్ కూడా ఎక్కువే. కిస్, బెడ్ సీన్లతో ఈ సిరీస్ యూత్ ను టెంమ్ట్ చేసే ఛాన్స్ ఉంది.

ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన అమెరికన్ వెబ్ సిరీస్ ల్లో ది స‌మ్మ‌ర్ ఐ ట‌ర్న్‌డ్ ప్రెటీ ఒకటి. ఈ న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామా సిరీస్ మూడో సీజన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. జూలై 16 నుంచి ఈ మూడో సీజన్ ఓటీటీలో అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి వచ్చిన రెండు సీజన్లు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోల...