Hyderabad, జూలై 26 -- ఓటీటీలోకి ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. ఇక ఓటీటీ ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడే జోనర్లలో హారర్ ఒకటి. హారర్ థ్రిల్లర్స్‌కు మరికొన్ని అంశాలను అదనంగా జోడించి తెరకెక్కిస్తే మంచి హిట్ కొడతాయి. అందుకే మేకర్స్ ఈ జోనర్ సినిమాలను ఎక్కువగా తెరకెక్కిస్తుంటారు.

ఇక తెలుగులో ఎన్నో రకాల హారర్ థ్రిల్లర్స్ వచ్చాయి. అలా రెండేళ్ల క్రితం అంటే 2023లో వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీనే దక్ష. ఈ సినిమాలో సీనియర్ నటుడు శరత్ బాబు కుమారుడు ఆయుష్ తేజ్ హీరోగా చేశాడు. అతనితోపాటు అఖిల్, అను, నక్షత్ర, రియా, రవి రెడ్డి, శోభన్ బోగరాజు, పవన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మించిన దక్ష సినిమాకు వివేకానంద విక్రాంత్ దర్శకత్వం వహించారు. 2023 ఆగస్టు 2...