Hyderabad, మే 1 -- మలయాళం మిస్టరీ థ్రిల్లర్ సినిమాకు అభిమానులా? అయితే ఈ నెలలో ఈటీవీ విన్ ఓటీటీలోకి ఆ ఇండస్ట్రీకి చెందిన ఈ జానర్ మూవీ తెలుగులో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఇదేకాదు మరో ఆరు సరికొత్త సినిమాలను కూడా మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆ ఓటీటీ గురువారం (మే 1) వెల్లడించింది.

ఈటీవీ విన్ ఓటీటీ క్రమంగా దూకుడు పెంచుతోంది. ప్రతి నెలా మొదటి రోజే ఆ నెలలో తమ ఓటీటీలోకి రాబోతున్న సినిమాల గురించి వెల్లడించే ఆ ప్లాట్‌ఫామ్.. గురువారం (మే 1) తన ఎక్స్ అకౌంట్ ద్వారా మే నెల రిలీజెస్ గురించి తెలిపింది. ఈ నెల మొత్తంగా ఏడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

వాటిలో మే నెల తొలి రోజే ముత్తయ్య అనే సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. 70 ఏళ్ల వయసులోనూ నటనపై మక్కువతో సినిమాల్లో నటించాలని తపించే ఓ వృద్ధుడి చుట్టూ తిరిగే కథ ఇది. ప్రస్తుతం ఈ మూవీ స్ట్రీమిం...