Hyderabad, జూన్ 11 -- ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ సినిమా మరో రెండు రోజుల్లోనే వస్తోంది. ఈ లోబడ్జెట్ మెడికల్ డ్రామా థియేటర్లలో రిలీజైన సుమారు రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ పేరు డియర్ ఉమ. ఏప్రిల్లో రిలీజైన ఈ సినిమాకు ఐఎండీబీలో మాత్రం 8.8 రేటింగ్ సాధించడం విశేషం.

పృథ్వీ అంబ‌ర్‌, సుమ‌య‌రెడ్డి హీరోహీరోయిన్లుగా న‌టించిన డియ‌ర్ ఉమ మూవీ ఏప్రిల్ 18న థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఈ మూవీకి సాయిరాజేష్ మ‌హాదేవ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాను శుక్రవారం (జూన్ 13) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది.

ఈ విషయాన్ని బుధవారం ఆ ఓటీటీ వెల్లడించింది. "జీవితాన్నే మించిన ప్రేమ.. దేవ్, ఉమ ఆత్మీయ ప్రేమ జూన్ 13 నుంచి ప్రారంభం కానుంది. డియర్ ఉమ జూన్ 13 నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కానుంది" అని ఆ ఓట...