భారతదేశం, జనవరి 15 -- మలయాళ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఇప్పుడు అలాంటి మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ డ్రామా 'కిర్‌క్కన్' (Kirkkan) డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చేసింది. రెండున్నరేళ్ల కిందట అంటే 2023 జులైలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. పెద్దగా ప్రమోషన్లు లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ కంటెంట్ పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు సన్ నెక్స్ట్ (Sun NXT), ఓటీటీ ప్లే ప్రీమియం వేదికగా జనవరి 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

ప్రముఖ మలయాళ నటి కని కుస్రుతి నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ సినిమా సన్ నెక్ట్స్ ఓటీటీలోకి వచ్చినా కేవలం మలయాళం ఆడియోనే అందుబాటులో ఉంది. నిజానికి అప్పట్లో తెలుగులోనూ రిలీజైనా.. ఇప్పుడు ఓటీటీలో మాత్రం ఆ వెర్షన్ అందుబాటులోకి రాలేదు.

ఇదొక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. 2005లో కేరళలోని కొట్టాయ...