భారతదేశం, అక్టోబర్ 28 -- హాలీవుడ్‌లో ఇప్పటికే ఎన్నో సంచలనాలు సృష్టించిన జురాసిక్ పార్క్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన మరో మూవీ జురాసిక్ వరల్డ్ రీబర్త్. ఈ సినిమా జులై 2న థియేటర్లలో రిలీజ్ కాగా.. మొత్తానికి నాలుగు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వస్తోంది. ఇప్పటికే ప్రైమ్ వీడియోలో రెంట్ విధానంలో అందుబాటులోకి రాగా.. ఇప్పుడు ఫ్రీగా మరో ఓటీటీలోకి వస్తోంది.

జురాసిక్ పార్క్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన ఏడో సినిమా, జురాసిక్ వరల్డ్ నుంచి వచ్చిన నాలుగో మూవీ జురాసిక్ వరల్డ్ రీబర్త్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.7600 కోట్లు వసూలు చేసింది. అలాంటి మూవీ ఇప్పుడు నవంబర్ 14 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మంగళవారం (అక్టోబర్ 28) ఆ ఓటీటీ అనౌన్స్ చేసింది.

ఈ సినిమాను ఇంగ్లిష్ తోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో చూడొచ్చు. ...