Hyderabad, అక్టోబర్ 1 -- బ్లాక్‌బస్టర్ హారర్ థ్రిల్లర్ ఫ్రాంఛైజీ ఫైనల్ డెస్టినేషన్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన సరిగ్గా ఐదు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.2700 కోట్లు వసూలు చేసిన సినిమా ఇది. ఈ ఫ్రాంఛైజీ నుంచి 14 ఏళ్ల తర్వాత వచ్చిన ఆరో మూవీ కావడం విశేషం.

అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ (ఫైనల్ డెస్టినేషన్ 6) ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమాను జియోహాట్‌స్టార్ ఓటీటీ అక్టోబర్ 16 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. ఇంగ్లిష్ తోపాటు తెలుగు, హిందీ, తమిళంలలో స్ట్రీమింగ్ కానుంది.

ఈ విషయాన్ని ఆ ఓటీటీ బుధవారం (అక్టోబర్ 1) సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. "కుటుంబంలో చావు నాట్యమాడుతుంది. ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్‌లైన్స్ అక్టోబర్ 16 నుంచి ఇంగ్...