భారతదేశం, డిసెంబర్ 24 -- హాలీవుడ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'వెపన్స్' (Weapons) ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోంది. జాక్ క్రెగ్గర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ థియేటర్లలో మంచి విజయం సాధించింది. జనవరి 8 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా కథ, విశేషాలు ఇవే.

కొత్త ఏడాదిని (2026) ఒక మంచి హారర్ థ్రిల్లర్‌తో మొదలుపెట్టాలనుకుంటున్నారా? అయితే మీకోసం 'వెపన్స్' సిద్ధంగా ఉంది. 'బార్బేరియన్' వంటి డిఫరెంట్ హారర్ సినిమా తీసిన దర్శకుడు జాక్ క్రెగ్గర్ తెరకెక్కించిన తాజా సినిమా ఇది. ఆగస్టు 2025లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను భయపెట్టడానికి వస్తోంది.

వచ్చే ఏడాది జనవరి 8న ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ ఉంటుంది. జియోహాట్‌స్టార్ ఓటీటీ ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనుంది. ఇంతకుముందు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో రెంట్ విధానంలో...