భారతదేశం, ఫిబ్రవరి 18 -- ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించి, అత్యధిక వసూళ్లు సాధించిన చైనీస్ యానిమేటెడ్ మూవీ 'నీ జా 2' (Ne Zha 2) ఎట్టకేలకు ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. అద్భుతమైన విజువల్స్, ఎమోషనల్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 20 నుంచి జియోహాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2.2 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ.20 వేల కోట్లు వసూలు చేయడం విశేషం.

యానిమేషన్ సినిమాల చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించిన సినిమా 'నీ జా 2'. 2025లో విడుదలైన ఈ చైనీస్ ఎపిక్, తన ప్రీక్వెల్ (మొదటి భాగం) రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా, ప్రపంచంలోనే అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన యానిమేటెడ్ చిత్రంగా నిలిచింది. హాలీవుడ్ సినిమాలు కాకుండా 1 బిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిన మొట్టమొదటి యానిమేటెడ్ సినిమాగా ఇది రికార్డ...