భారతదేశం, జూలై 17 -- ఓటీటీలోకి మరో యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ వచ్చేసింది. గుటార్ గు వెబ్ సిరీస్ మూడో సీజన్ డిజిటల్ స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. ఈ కొత్త సీజన్ ను ఓటీటీలో ఫ్రీగా చూడొచ్చు. లివ్ఇన్ రిలేషన్ షిప్ లో ఉండే రియల్ లైఫ్ స్ట్రగుల్స్ ను ఈ సిరీస్ లో డిస్కస్ చేశారు. యూత్ లవ్ రొమాంటిక్ స్టోరీగా దీన్ని తెరకెక్కించారు.

గుటార్ గు వెబ్ సిరీస్ కొత్త సీజన్ ఈ రోజు (జూలై 17)న ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లో ఈ సిరీస్ మూడో సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఓటీటీలో సిరీస్ ను ఫ్రీగా చూడొచ్చు. ఎలాంటి సబ్ స్క్రిప్షన్ అవసరం లేదు. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ స్టోరీ గత రెండు సీజన్లు ఆడియన్స్ ను బాగానే అలరించాయి.

గుటార్ గు వెెబ్ సిరీస్ మూడో సీజన్ లో రొమాన్స్ మరింత పెరిగింది. యంగ్ కపుల్ అనుజ్, రీతుగా విశేష్ బన్సాల్, అశ్లీష ఠాకూర్ నటించారు. ఈ...