భారతదేశం, ఆగస్టు 3 -- ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ మూవీ రాబోతోంది. పాజిటివ్ రెస్పాన్స్ తో మంచి రేటింగ్ దక్కించుకున్న 'ఓహో ఎంతన్ బేబీ' (Oho Enthan Baby) ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధమైంది. యూత్ ఫుల్ లవ్ స్టోరీగా ఈ మూవీ మంచి ఫీల్ ను అందించనుంది. ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి వస్తుందంటే?

తమిళ రొమాంటిక్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ 'ఓహో ఎంతన్ బేబీ' ఓటీటీ రిలీజ్ కు వేళైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 8 న ఈ మూవీ ఓటీటీలో అడుగుపెడుతుంది. ఈ తమిళం ఒరిజినల్ మూవీ అయిదు భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తుంది. తెలుగులోనూ అందుబాటులో ఉంటుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఓహో ఎంతన్ బేబీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తుంది.

ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ సోషల్ మీడియాలో ప...