భారతదేశం, డిసెంబర్ 15 -- ఓటీటీలోకి వారం వారం సరికొత్త సినిమాల సందడి సాగుతూనే ఉంటోంది. కొత్త వారంలోకి ఎంట్రీ ఇవ్వగానే వచ్చే లేటెస్ట్ ఓటీటీ రిలీజెస్‌పై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. అందులోనూ తెలుగు కంటెంట్ ఓటీటీ సినిమాలకు మరింత క్రేజ్ ఉంటోంది. ఈ క్రమంలోనే ఈ వారం ఓటీటీలోకి తెలుగు సినిమా రానుంది.

ఆ మూవీనే ప్రేమంటే. థ్రిల్ ప్రాప్తిరస్తు అనేది మూవీ క్యాప్షన్. తెలుగులో రొమాంటిక్ కామెడీ జోనర్‌లో ఈ సినిమా తెరకెక్కింది. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి, బ్యూటిఫుల్ భామ ఆనంది హీరో హీరోయిన్లుగా నటించారు.

స్టార్ యాంకర్ సుమ కనకాల కీలక పాత్ర పోషించి నవ్వించిన ఈ సినిమాలో ఆమెతోపాటు వెన్నెల కిశోర్, హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్ సైతం కామెడీతో ఆకట్టుకున్నారు. ప్రేమంటే సినిమాకు నవనీత్ శ్రీరామ్ కథ అందించి దర్శకత్వం వహించారు. రానా స్పిరిట్ మీడియా సమర్పణలో ప...