భారతదేశం, ఏప్రిల్ 29 -- మ‌ల‌యాళం జాంబీ థ్రిల్ల‌ర్ మూవీ స‌మ‌ర థియేట‌ర్ల‌లో రిలీజైన రెండేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. ఏప్రిల్ 30 నుంచి సైనా ప్లే ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీలో రెహ‌మాన్‌, భ‌ర‌త్‌, రాహుల్ మాధ‌వ్ హీరోలుగా న‌టించారు. ఛార్లెస్ జోసెఫ్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

2022లో థియేట‌ర్ల‌లో రిలీజైన స‌మ‌ర మూవీ డిఫ‌రెంట్ అటెంప్ట్‌గా ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల‌ను అందుకున్న‌ది. కానీ క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం ఆశించిన విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. ఈ సినిమాలోని విజువ‌ల్స్‌, యాక్ష‌న్ ఎపిసోడ్స్ మాత్రం హాలీవుడ్ స్టైల్‌లో ఉన్నాయంటూ కామెంట్స్ వ‌చ్చాయి. ఈ మ‌ల‌యాళం మూవీకి గోపీ సుంద‌ర్ మ్యూజిక్ అందించాడు.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని స్నో వ్యాలీలో వ‌రుస‌గా హ‌త్య‌లు జ‌రుగుతుంటాయి. ఈ హ‌త్య‌ల‌కు సంబంధించి పోలీసుల‌కు ...