భారతదేశం, నవంబర్ 28 -- హారర్ థ్రిల్లర్ మూవీస్ అంటేనే భయపెడతాయి. ఇందులో కామెడీని మిక్స్ చేసిన సినిమాలు కొన్ని. కానీ కేవలం హారర్ ఎలిమెంట్స్ తోనే వణికించే చిత్రాలు కొన్ని వస్తాయి. అలాంటి ఫ్యూర్ హారర్ థ్రిల్లర్ 'డీయస్ ఈరే'. మలయాళ దిగ్గజ నటుడు మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ ఈ సినిమాలో హీరో. అతను యాక్టింగ్ తో మెప్పించాడు.

మలయాళ హారర్ థ్రిల్లర్ డీయస్ ఈరే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను ఇవాళ (నవంబర్ 28) ఓటీటీ ప్లాట్ ఫామ్ అనౌన్స్ చేసింది. ఈ బ్లాక్ బస్టర్ సినిమా జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. డిసెంబర్ 5 న డీయస్ ఈరే సినిమా ఓటీటీ రిలీజ్ అవుతుంది. ఓటీటీ డేట్ ను అనౌన్స్ చేస్తూ జియోహాట్‌స్టార్‌ మలయాళం ఎక్స్ లో వీడియో పంచుకుంది.

డీయస్ ఈరే సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. ఈ హారర్ థ్రిల్లర్ మలయాళం, తెలుగు, త...