భారతదేశం, జనవరి 9 -- మలయాళ సూపర్ స్టార్స్ మోహన్‌లాల్, దిలీప్ కలిసి నటించిన క్రేజీ యాక్షన్ కామెడీ మూవీ 'భ భ బ' (భయం భక్తి బహుమానం). భారీ అంచనాల మధ్య డిసెంబర్ 18న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా కథాకమామీషు, బాక్సాఫీస్ రిపోర్ట్.. ఓటీటీ వివరాలు ఇక్కడ చూడండి.

ఈ మధ్య మలయాళం సినిమాల జోరు పెంచుతున్న జీ5 ఓటీటీయే భ భ బ మూవీ హక్కులను కూడా సొంతం చేసుకుంది. తాజాగా మూవీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేసింది. జనవరి 16న అంటే కనుమ నుంచి ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్లు వసూలు చేసిన ఈ మూవీకి ఓటీటీలో మరింత మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం మలయాళం వెర్షన్ (ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో) కన్ఫర్మ్ అయ్యింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ...