Hyderabad, జూలై 7 -- నెట్‌ఫ్లిక్స్ లోకి లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ డ్రామా 8 వసంతాలు మూవీ వచ్చేస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ విషయాన్ని ఆ ఓటీటీ సోమవారం (జులై 7) వెల్లడించింది. ఈ వారమే డిజిటల్ ప్రీమియర్ కానుంది. జూన్ 20న థియేటర్లలో రిలీజైన ఈ 8 వసంతాలు సినిమాకు ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ లభించలేదు.

తెలుగు రొమాంటిక్ డ్రామా 8 వసంతాలు. పుష్ప మేకర్స్ మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించిన సినిమాగా రిలీజ్ కు ముందే మంచి బజ్ నెలకొంది. అయితే అది బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు. జూన్ 20న థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పుడు మూడు వారాల్లోనే అంటే వచ్చే శుక్రవారం (జులై 11) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

తెలుగు సహా మొత్తం 4 భాషల్లో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. "8 వసంతాలు.. ...