భారతదేశం, జూలై 6 -- ఎన్నో ఆశలు.. మరెన్నో అంచనాలు. తన ఫేవరేట్ స్టార్ పవన్ కల్యాణ్ టైటిల్ కూడా తన సినిమాకు పెట్టుకున్నాడు. కానీ నితిన్ కు షాక్ తప్పలేదు. అతని లేటెస్ట్ సినిమా 'తమ్ముడు' బాక్సాఫీస్ దగ్గర దారుణ పరాజయం పాలైంది. నితిన్ కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా బాక్స్ ఆఫీస్ వద్ద తక్కువ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను షాక్ చేసింది. ఈ నేపథ్యంలో తమ్ముడు మూవీ ముందుగానే ఓటీటీలోకి వచ్చే అవకాశముంది.

తమ్ముడు మూవీ ఓటీటీ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌ పోటీపడ్డాయి. కానీ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు అమెజాన్ ప్రైమ్ వీడియోతో డీల్ కంప్లీట్ కాలేదు. ఎక్కువ డబ్బులు ఆఫర్ చేసిన నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం కుదిరింది. దీంతో నెట్‌ఫ్లిక్స్‌లోనే తమ్ముడు మూవీ స్ట్రీమింగ్...