భారతదేశం, జనవరి 27 -- ఈ ఏడాది మలయాళం నుంచి రాబోతున్న మొదటి వెబ్ సిరీస్‌గా 'రోస్లిన్: సీక్రెట్ స్టోరీస్ అన్‌ఫోల్డ్' (Roslin) నిలవనుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ ద్వారా ఈ వెబ్ సిరీస్ డిజిటల్ అరంగేట్రం చేయనుందని అధికారికంగా ధృవీకరించారు. సీనియర్ నటి మీనా, ప్రముఖ నటుడు వినీత్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయనప్పటికీ ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

గతేడాది డిసెంబరులో జరిగిన 'సౌత్ అన్‌బౌండ్' ఈవెంట్‌లో జియోహాట్‌స్టార్ అనౌన్స్ చేసిన ఐదు మలయాళ వెబ్ సిరీస్‌లలో 'రోస్లిన్' కూడా ఒకటి. ఇప్పుడు ఆ జాబితా నుంచి విడుదలవుతున్న మొదటి వెబ్ సిరీస్ ఇదేనని ప్లాట్‌ఫామ్ ఖరారు చేసింది. నిర్మాతలు అధికారిక తేదీని వెల్లడించకపోయినా.. ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం...