భారతదేశం, డిసెంబర్ 23 -- మలయాళం మిస్టరీ థ్రిల్లర్ సినిమా లవర్స్ కు గుడ్ న్యూస్. ఓటీటీలోకి ఈవారం మరో ఇంట్రెస్టింగ్ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సినిమాను సన్ నెక్ట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతోంది. గత నెల 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సుమారు నెలన్నర రోజుల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుండటం విశేషం.

మలయాళంలో వచ్చిన లేటెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ నిధియుమ్ భూతవుమ్. ఈ సినిమా బుధవారం (డిసెంబర్ 24) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీయే వెల్లడించింది.

"గతం మౌనంగా ఉండటానికి నిరాకరించినప్పుడు.. నిధియుమ్ భూతవుమ్ రేపటి నుంచి సన్ నెక్ట్స్ లో చూడండి" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. దీనికి మూవీలోని ఓ చిన్న వీడియోను జోడించింది.

నిధియుమ్ భూతవుమ్ సినిమా నవంబర్ 14న థియేటర్లలో రిలీజైంది. అనీష్ జీ మేనన్ ఇందులో లీడ్ రోల్లో నట...