Hyderabad, మే 5 -- ఓటీటీలోకి మలయాళం సినిమాలు క్యూ కడుతున్నాయి. ప్రతి వారం కనీసం ఓ హిట్ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్ పైకి అడుగుపెడుతోంది. ఇక ఇప్పుడు మరో సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫమ్ అయింది. గత నెలలో రిలీజై ఓ మోస్తరు విజయం సాధించిన డార్క్ కామెడీ మూవీ ఇది. బాక్సాఫీస్ దగ్గర రూ.18 కోట్లు వసూలు చేసింది.

మలయాళం స్టార్ హీరో, కామెడీకి మారుపేరు అయిన బేసిల్ జోసెఫ్ నటించిన మూవీ మరణమాస్ (Maranamass). ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడీ సినిమాను మే 15 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనీ లివ్ (Sony Liv) ఓటీటీ సోమవారం (మే 5) వెల్లడించింది.

"అసలు మీకు ఏమీ అర్థం కాని, ప్రతిదీ పిచ్చెక్కించే ప్రపంచానికి మీకు స్వాగతం. మరణమాస్ మూవీని సోనీలివ్ ఓటీటీలో మే 15 నుంచి చూడండి" అనే క్యాప్షన్ తో ఈ విషయం తెలిపింది. ఐఎండీబీలో 8 రేటింగ్ సంపాదించిన సినిమా ఇది.

మర...