Hyderabad, సెప్టెంబర్ 29 -- ఓటీటీలోకి ఈ వారం మరో ఇంట్రెస్టింగ్ మలయాళం క్రైమ్ కామెడీ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సినిమా పేరు సాహసం (Sahasam). ఆగస్టు 8న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సుమారు రెండు నెలల తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. క్రైమ్ తోపాటు కామెడీ, యాక్షన్ కలగలిపిన ఈ సినిమాకు ఐఎండీబీలో 7.8 రేటింగ్ నమోదు కావడం విశేషం.

మలయాళం క్రైమ్ కామెడీ మూవీ సాహసంను సన్ నెక్ట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. దసరాకు ఒక్క రోజు ముందు అంటే బుధవారం (అక్టోబర్ 1) నుంచి ఈ ఓటీటీలో మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

"నిజం, దృఢత్వానికి సంబంధించిన స్టోరీలో యాక్షన్ ను కామెడీ కలుస్తుంది. సాహసం మిస్ కావద్దు. సన్ నెక్ట్స్ లో అక్టోబర్ 1న ప్రీమియర్ కానుంది. డోన్ట్ మిస్" అనే క్యాప్షన్ తో సినిమాకు సంబంధి...