Hyderabad, ఏప్రిల్ 23 -- ఓటీటీలోకి మరో మలయాళం అడ్వెంచర్ కామెడీ మూవీ తెలుగులో స్ట్రీమింగ్ కు రాబోతోంది. కనిపించకుండా పోయిన అన్న కోసం అతని స్నేహితులతో కలిసి తమ్ముడి సాగించే వేట చుట్టూ తిరిగే మూవీ ఇది. సుమారు రెండున్నర నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. మరి ఈ సినిమా స్ట్రీమింగ్ వివరాలు తెలుసుకోండి.

ఓటీటీలోకి వస్తున్న మలయాళ కామెడీ మూవీ బ్రొమాన్స్ (Bromance). ఈ సినిమాను సోనీలివ్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. మే 1న డిజిటల్ ప్రీమియర్ ఉంటుందని ఆ ఓటీటీ బుధవారం (ఏప్రిల్ 23) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

ఈ సందర్భంగా ఓ ఫన్నీ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసింది. మలయాళంతోపాటు తెలుగు, కన్నడ, తమిళం భాషల్లోనూ బ్రొమాన్స్ మూవీ స్ట్రీమింగ్ కు రాబోతోంది. "గందరగోళం, కామెడీ, మీరు ఎప్పటికీ మరచిపోలేని ఓ గ్యాంగ్. బ్రొమాన్స్ మే 1 నుంచి సోనీలివ్ లో చూడండి" ...