Hyderabad, సెప్టెంబర్ 1 -- హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌‌గా తెరకెక్కిన సినిమా 'కన్నప్ప'. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన కన్నప్ప సినిమాను కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు నిర్మించారు. కన్నప్ప సినిమాలో మంచు విష్ణుకు జోడీగా తమిళ అందం ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా చేసింది.

అలాగే, కన్నప్ప సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తోపాటు మలయాళ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్, శరత్ కుమార్, చందమామ కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, మధుబాల, బ్రహ్మానందం తదితర అగ్ర తారలు కీలక పాత్రలు పోషించారు.

భారీ అంచనాల మధ్య జూన్ 27 థియేటర్స్‌లో విడుదలైన కన్నప్ప పర్వాలేదనిపించుకుంది. సినిమా అంత ఓకే ఓకేగా సాగిన క్లైమాక్స్‌లో మాత్రం మంచు విష్ణు అదరగొట్టేశాడని రివ్యూలు వచ్చాయి. అలాగే, ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ అభిమానులకు ట్రీట్ అంద...