Hyderabad, మే 9 -- ఓటీటీలోకి తెలుగులోనూ డిఫరెంట్ జానర్ల వెబ్ సిరీస్ వస్తున్నాయి. అందులో ఒకటి దేవిక అండ్ డానీ (Devika and Danny). ఈ రొమాంటిక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను జియోహాట్‌స్టార్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. కొన్ని రోజుల కిందటే ఈ సిరీస్ ను అనౌన్స్ చేసిన ఆ ఓటీటీ.. తాజాగా శుక్రవారం (మే 9) టీజర్ రిలీజ్ చేసింది.

హాట్‌స్టార్ స్పెషల్స్ గా రూపొందున్న వెబ్ సిరీస్ ఈ దేవిక అండ్ డానీ. ఈ సిరీస్ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. "ఇది అనుకోకుండా కలిసిన రెండు మనసుల కథ. లవ్ స్టోరీలను రూల్స్ ప్రకారమే ఆడాలని ఎవరు చెప్పారు? దేవిక అండ్ డానీ టీజర్ వచ్చేసింది. కిశోరుడు డైరెక్ట్ చేశాడు" అనే క్యాప్షన్ తో జియోహాట్‌స్టార్ ఈ టీజర్ రిలీజ్ చేసింది. సిరీస్ స్ట్రీమింగ్ తేదీని ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే అని మాత్రం ఆ ఓటీటీ చెప్పింది.

దేవిక అండ్ డానీ టీజర్ ఇం...