భారతదేశం, డిసెంబర్ 1 -- బాలీవుడ్ 'ధక్ ధక్' గర్ల్ మాధురీ దీక్షిత్ మరోసారి డిజిటల్ తెరపై సంచలనం సృష్టించడానికి సిద్ధమైంది. 2022లో వచ్చిన 'ది ఫేమ్ గేమ్' తర్వాత ఆమె నటిస్తున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'మిసెస్ దేశ్‌పాండే' (Mrs Deshpande). విలక్షణ దర్శకుడు నగేష్ కుకునూర్ తెరకెక్కిస్తున్న ఈ సిరీస్ ట్రైలర్‌ను సోమవారం (డిసెంబర్ 1) మేకర్స్ విడుదల చేశారు. ఇందులో మాధురీ మునుపెన్నడూ చూడని విధంగా ఒక సీరియల్ కిల్లర్ అవతారంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

'మిసెస్ దేశ్‌పాండే' ట్రైలర్ ప్రారంభమే చాలా ఆసక్తికరంగా, భయానకంగా ఉంది. మాధురీ దీక్షిత్ తన దిల్ తో పాగల్ హై మూవీలోని సూపర్ హిట్ పాట "భోలీ సీ సూరత్" పాడుతూ, ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేయడం చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది.

ఆ తర్వాత ఆమె జైలు కటకటాల వెనుక ఉండి.. "నేను లోపల ఉన్నాను, అంటే బయట ఎవ...