భారతదేశం, ఫిబ్రవరి 11 -- ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (Zee5) తన నాలుగో కన్నడ ఒరిజినల్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 'రాక్షస' పేరుతో తెరకెక్కిన ఈ సిరీస్ ఫిబ్రవరి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సుహాన్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ నిర్మాత తరుణ్ సుధీర్ నిర్మించాడు. ఇందులో కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర ప్రధాన పాత్రలో, మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. మొత్తం 7 ఎపిసోడ్లు ఉండే ఈ సిరీస్, ఒక్కో ఎపిసోడ్ దాదాపు 25 నిమిషాల నిడివితో ఉంటుంది.
ఉత్తర కర్ణాటకలోని సౌదత్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కథ జరుగుతుంది. అక్కడ విజయ్ రాఘవేంద్ర ఎస్.ఐ హనుమప్ప పాత్రలో నటిస్తున్నాడు. ఆ ప్రాంతంలో ఒక మనుషులను తినే మొసలి తిరుగుతుందనే భయం ప్రజల్లో ఉంటుంది. స్థానిక కుమ్మరి సంఘం జరుపుకునే పండగ సమయంలో నది ఒడ్డున ఒక మనిషి శరీర భాగాలు దొరు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.