Hyderabad, ఏప్రిల్ 23 -- ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను సరికొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది సోనీలివ్ ఓటీటీ. బ్లాక్ వైట్ అండ్ గ్రే: లవ్ కిల్స్ పేరుతో ఈ ఓటీటీలోకి ఓ సిరీస్ రాబోతోంది. ఇది ఓ సాధారణ యువకుడు నాలుగు హత్యలు చేశాడన్న ఆరోపణలు ఎదుర్కోవడం, దాని వెనుక ఉన్న నిజాన్ని వెలికితీసే ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ చుట్టూ తిరుగుతుంది.

బ్లాక్ వైట్ అండ్ గ్రే: లవ్ కిల్స్ అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను గతంలోనే సోనీలివ్ ఓటీటీ అనౌన్స్ చేసింది. పది రోజుల కిందటే ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది. అయితే తాజాగా ఈ సిరీస్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ ప్రమోషనల్ వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.

ఓ ఫిక్షనల్ క్రైమ్ డ్రామాకు డాక్యుమెంటరీలలో ఉపయోగించే ఇంటర్వ్యూలు, అసలు ఫుటేజీని ఉపయోగించడం ఈ మాకుమెంటరీ స్టైల్ సిరీస్ ప్రత్య...