Hyderabad, అక్టోబర్ 8 -- కన్నడ నుంచి ఈ ఏడాది మొదట్లో తొలి వెబ్ సిరీస్ వచ్చింది. అయితే ఆ తర్వాత అక్కడి మేకర్స్ నుంచి వరుస వెబ్ సిరీస్ వస్తున్నాయి. తాజాగా మారిగల్లు (Maarigallu) పేరుతో మరో సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ అక్టోబర్ 31 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

కన్నడ ఇండస్ట్రీ దివంగత పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ బ్యానర్ నుంచి వస్తున్న మొదటి కన్నడ వెబ్ సిరీస్ ఈ 'మారిగల్లు'. తాజాగా బుధవారం (అక్టోబర్ 8) ఓ టీజర్ రిలీజ్ చేస్తూ.. స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేశారు. 'మత్స్యగంధ' ఫేమ్ దేవరాజ్ పూజారి దర్శకత్వం వహించిన ఈ షో.. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన 'అయ్యన మణి', 'శోధ' తర్వాత జీ నెట్‌వర్క్ కోసం రూపొందించిన మూడో కన్నడ ఒరిజినల్. ఈ 6 ఎపిసోడ్‌ల సస్పెన్స్ థ్రిల్లర్ అక్టోబర్ 31 నుండి జీ5 ఓటీటీతోపాటు ఓటీటీప్లే ప్రీమియంలోనూ అం...