Hyderabad, అక్టోబర్ 10 -- బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ మరోసారి హీరో హీరోయిన్లుగా జోడీ కట్టిన సినిమా కిష్కింధపురి. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో మకరంద్ దేశ్‌పాండే కీలక పాత్ర పోషించారు. సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించిన ఈ హారర్-థ్రిల్లర్ కిష్కింధపురి థియేటర్లలో సంచలన విజయాన్ని నమోదు చేసి ప్రేక్షకులను అలరించింది. హారర్ థ్రిల్లర్ అభిమానులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించిన కిష్కింధపురి ఓటీటీలోకి వచ్చేయనుంది.

ఇప్పటికే కిష్కింధపురి ఓటీటీ స్ట్రీమింగ్‌పై పలు వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా ఇవాళ (అక్టోబర్ 10) కిష్కింధపురి ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ల...