భారతదేశం, డిసెంబర్ 30 -- దశాబ్ద కాలం పాటు హారర్, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ, యాక్షన్, అడ్వెంచర్లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన 'స్ట్రేంజర్ థింగ్స్' (Stranger Things) ప్రయాణం ముగింపు దశకు చేరుకుంది. తాజాగా ఈ ఓటీటీ సిరీస్ చివరి ఎపిసోడ్ కోసం 'ఒక ఆఖరి ట్రైలర్'ను విడుదల చేసింది.

హాకిన్స్ పట్టణంపై విరుచుకుపడుతున్న వెక్నాను అడ్డుకునేందుకు ఎలెవన్, ఆమె గ్యాంగ్ సిద్ధమైన తీరు చూస్తుంటే, ఈసారి పోరాటం ఊహకందని స్థాయిలో ఉండబోతోందని అర్థమవుతోంది.

స్ట్రేంజర్ థింగ్స్ ఫైనల్ ఎపిసోడ్ ఫైనల్ ఎపిసోడ్‌ ట్రైలర్ గత ఐదు సీజన్లలోని మధుర జ్ఞాపకాలను, సాహసాలను నెమరువేసుకుంటూనే, రాబోయే భయంకరమైన యుద్ధాన్ని పరిచయం చేసింది. "నీ స్నేహితుల కోసం, రేపటి ఉదయం కోసం ఒక ఆఖరి సారి పోరాడు" అంటూ హాపర్ ఇచ్చే స్ఫూర్తిదాయకమైన మాటలు ఎలెవన్‌ను కదిలిస్తాయి.

మరోవైపు, డస్టిన్ ఆవేదనగా ...