భారతదేశం, జనవరి 1 -- భారతీయ న్యాయ చరిత్రలో మైలురాయిగా నిలిచిన 'షా బానో' రియల్ లైఫ్ కేసు ఆధారంగా తెరకెక్కిన సంచలన చిత్రం 'హక్' (Haq). సుపర్ణ్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ లీగల్ కోర్ట్‌ రూమ్ డ్రామా ఇప్పుడు డిజిటల్ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది.

థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న హక్ ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో హక్ ఓటీటీ రిలీజ్‌పై సర్వత్రా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. తెలుగులోనూ కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన యామీ గౌతమ్, ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమే హక్.

హక్ సినిమా కథ షాజియా (యమీ గౌతమ్ ధర్) అనే ఒక సాధారణ గృహిణి చుట్టూ తిరుగుతుంది. చదువుకోకపోయినా సంప్రదాయాలకు కట్టుబడి ఉండే షాజియా.. విజయవంతమైన న్యాయవాది అబ్బాస్ ఖాన్ (ఇమ్రాన్ హష్మీ)ను వివాహం చేసుకుంటుంది.

కానీ, ఉన్నట్టుండి అబ్...