భారతదేశం, నవంబర్ 27 -- యానిమల్స్‌కు రిలేట్ చేస్తున్న సినిమాలు రావడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఓటీటీలో ఎన్నో రకాల జోనర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ పెట్స్‌ను బేస్ చేసుకుని ఒక కథను అల్లుకుని తెరకెక్కించే సినిమాలు ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేస్తుంటాయి.

అలా ఇటీవల ప్రేక్షకులను ఆకర్షించిన సినిమానే ది పెట్ డిటెక్టివ్. మలయాళంలో కామెడీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీగా ది పెట్ డిటెక్టివ్ తెరకెక్కింది. ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, ష్రాఫ్ యు దీన్ ప్రధాన పాత్రలు పోషించారు. నివిన్ మిర్రర్, జియోమోన్ జ్యోతిర్, ప్రశాంత్ మాధవన్, నివేక్ మిర్రర్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలైన ది పెట్ డిటెక్టివ్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఐఎమ్‌డీబీ నుంచి పదికి ఏకంగా 8.5 రేటిం...