Hyderabad, సెప్టెంబర్ 22 -- హీరో నారా రోహిత్ భైరవం తర్వాత నటించిన సినిమా సుందరకాండ. తెలుగులో రొమాంటిక్ కామెడీ మూవీగా తెరకెక్కిన సుందరకాండ సినిమాకు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించారు. ఇదే ఆయనకు దర్శకుడిగా తొలి చిత్రం. ఈ సినిమాతో హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ చాలా కాలం గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు.

ఆమెతోపాటు గ్లామర్ బ్యూటీ వృతి వాఘాని సుందరకాండ మూవీలో మరో హీరోయిన్‌గా అట్రాక్ట్ చేసింది. నారా రోహిత్ కెరీర్‌లో 20వ చిత్రంగా తెరకెక్కిన సుందరకాండ సినిమాను సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్‌ మహంకాళి నిర్మించారు.

సుందరకాండ సినిమాలో హీరో హీరోయిన్లతో పాటు నరేష్ వీకే, రూప లక్ష్మీ, వాసుకి, కమెడియన్ సత్య, వీటీవీ గణేష్, అజయ్, అభినవ్ గోమఠం, రఘు బాబు, రఘు కారుమంచి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్ట్ 27న థియేటర్లలో విడుదలైన సుందరకాండ సిని...