భారతదేశం, సెప్టెంబర్ 3 -- ఓటీటీలోకి మరో క్రేజీ వెబ్ సిరీస్ రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న మనీ హీస్ట్ సిరీస్ క్రియేటర్లు రూపొందించిన కొత్త వెబ్ సిరీస్ డిజిటల్ ఆడియన్స్ ముందుకు వస్తుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ వెబ్ సిరీస్ రెడీ అయింది. మూడో వరల్డ్ వార్ జరుగుతుంటే బంకర్ లో దాచుకునే విలాసవంతమైన కుటుంబాల కథతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ పేరు 'బిలియనీర్స్ బంకర్'. ఇదో క్రైమ్ మిస్టరీ రొమాన్స్ సైంటిఫిక్ థ్రిల్లర్.

క్రైమ్ మిస్టరీ రొమాన్స్ సైంటిఫిక్ థ్రిల్లర్ గా రెడీ అయిన 'బిలియనీర్స్ బంకర్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. ఈ క్రేజీ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 19 నుంచి ఓటీటీ ఆడియన్స్ ను అలరించేందు...