భారతదేశం, సెప్టెంబర్ 7 -- మైఖేల్ బి జోర్డాన్ హీరోగా యాక్ట్ చేసిన సిన్నర్స్ ఈ సంవత్సరంలో అత్యంత ప్రశంసలు పొందిన చిత్రాలలో ఒకటి. ఇది ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీని థియేటర్లలో మిస్ అయ్యారా? చింతించకండి. ఎందుకంటే ర్యాన్ కూగ్లర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో ఓటీటీలోకి వస్తుంది.

సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ సిన్నర్స్ ఓటీటీలోకి రాబోతుంది. ఇది జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సూపర్ నేచురల్ మూవీ సెప్టెంబర్ 18న జియోహాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ప్లాట్‌ఫారమ్ వెబ్‌సైట్, యాప్‌లో దాని రాబోయే విడుదల కేటలాగ్‌లో భాగంగా కొత్త అప్ డేట్ పంచుకుంది.

ఓటీటీలోకి సిన్నర్స్

మైఖేల్ జోర్డాన్‌ ఇందులో కవల హీరోలుగా నటించాడు. స్మోక్, స్టాక్‌గా యాక్ట్ చేశాడు. వారు తమ కష్టతరమైన గతాన్ని తిరస్కరించే ప్రయత్నంలో మిస్సిస్సిప్...